ఎన్టీఆర్‌ 26వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం..

- November 25, 2015 , by Maagulf
ఎన్టీఆర్‌ 26వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం..

ఎన్టీఆర్‌ 26వ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. మోహన్‌లాల్‌ వంటి గొప్ప నటుడు మా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 25న తెలుగు చిత్రసీమ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ముహూర్తం షాట్స్‌ని చిత్రీకరించారు. 2016 ఆగస్టు 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com