మద్యం వద్దు మార్షల్ ఆర్ట్సే ముద్దు నటుడు భానుచందర్
- February 12, 2018
అవసరమైతే రాజీయాల్లోకి మళ్లీ వస్తా సినీ నటుడు భానుచందర్ యువత ప్రస్తుత తరుణంలో మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అప్పుడే మంచి శరీర దారుఢ్యంతో ఆరోగ్యంగా ఉంటారని, అందుకే అరవై దాటినా తాను యువకుడిలా ఉంటానని ప్రముఖ సినీనటుడు భానుచందర్ వెల్లడించారు. కోట మండలం విద్యానగర్ సోమవారం వచ్చిన ఆయన కాసేపు 'న్యూస్‌టుడే'తో ముచ్చటించారు. పలు విషయాలను వెల్లడించారు.. న్యూస్‌టుడే, కోట ప్రశ్న : ప్రస్తుత సినిమాలపై మీ అభిప్రాయం జవాబు : ప్రస్తుతం వస్తున్న సినిమాలు వారం రోజులు ఆడితే చాలు. వంద రోజులు, 50 రోజులు ఆడే రోజులు పోయాయి. ప్ర : సినిమాల్లోకి రాక ముందు ఏ వృత్తిలోకి వెళ్లాలనే లక్ష్యం ఉండేది? జవాబు : సంగీత దర్శకుడు కావాలని కుటుంబంలోని అందరు ప్రోత్సాహించారు. 'చివరికి నాలాగ ఎందరో' సినిమాతో హీరోగా వచ్చాను. ఇప్పటి వరకు 175 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను.
విడుదల కావలసి ఉంది. సినిమా రంగంలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లు రెండు కళ్ల వంటివారు. నేను నటించిన చిత్రాల్లో 50 వరకు నాకు మంచిపేరు తీసుకువచ్చాయి. నంది అవార్డులు కూడా అందుకున్నాను.
నా సినిమా విమర్శకులు ముందు మా పిల్లలు, సతీమణే. బుల్లితెరపై కూడా పలు సందేశాత్మక సీరియల్స్‌లో నటిస్తున్నాను. ప్ర : మీ పిల్లలు సినిమా రంగంలోకి వచ్చారా? జ : నా కుమారుడు జయంత్‌కు సినిమా రంగం అంటే ఇష్టం, డిగ్రీ పూర్తిచేశాడు. వచ్చే నెలలో జయంత్‌తో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. దర్శకత్వం కూడా నేనే చేస్తున్నాను.
రెండో కుమారుడు వైద్య వృత్తిలో సేవలు అందించాలని ప్రొత్సాహిస్తున్నాను. ఆడపిల్లలు లేరనే బాధ ఇప్పటికి వేధిస్తోంది. ప్ర : రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఎందుకు ఉన్నారు? జ : రాజకీయ పరిస్థితులు బాగా లేవు. అవసరమైతే మళ్లీ వస్తాను. ప్రజలకు సేవలు అందిస్తాను. ప్ర : యువతకు మీరు ఇచ్చే సందేశం? జ : యువత ముందుగా మద్యం, డ్రగ్స్‌కు, వ్యభిచారానికి దూరంగా ఉండాలి.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. దాంతో ఆరోగ్యంగా ఉంటారు. నేను అరవై ఏళ్లు దాటినా ఇలా ఉన్నాను అంటే కారణం మార్షల్ ఆర్ట్సే. మద్యం, డ్రగ్స్ వాడను.
మేకప్ కూడా తక్కువగా వేసుకుంటాను. ఇప్పటికి హుషారుగా ఉంటాను. ఈ విషయాలు యువత గుర్తుంచుకోవాలి. ఆహారంలో కూడా మితంగా మాంసం తింటాను.
శాకాహారంలో గుత్తి వంకాయ, ఇతర కూరగాయలు తింటాను. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను విస్మరిస్తాను.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి