ఒమాన్ లోని సమైల్ కారాగారంలో నిరాహారదీక్ష - వార్తలను తోసిపుచ్చిన పొలిసు శాఖ
- November 25, 2015
ఒమాన్ లోని సమైల్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 1800 మంది ఒమనీయులు గత ఆదివారం నుండి నిరాహార దీక్షను ప్రారంభించారని వస్తున్న వార్తలను జైలు అధికారులు తోసిపుచ్చారు. 45 వ జాతీయ దినోత్సవం సందర్భంగా, ఇంకా ఆయా కుటుంబాలు చేసుకున్న విజ్ఞాపనలను మన్నించి, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారు నవంబరు 17 న, 67 మంది ప్రవాసీయులతో సహా 160 మందికి రాజరిక క్షమాభిక్ష ప్రసాదించారు. ఐతే మీడియాలో చెప్పిన విధంగా ఏ విధమైన సామూహిక నిరాహారదీక్ష జరగడం లేదని, కేవలం 10 మంది మాత్రమే తమపేర్లు క్షమాభిక్ష జాబితాలో చేర్చనందుకు ఆహారాన్ని నిరాకరించారని స్పష్టం చేసారు. వారు క్షమాభిక్ష నిబంధనలకు అనుగుణంగా లేనందున వారి పేర్లు చేర్చబడలేదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..







