పెరిగిపోతున్న కాలుష్య మహమ్మారికి బ్రేక్ వేసేందుకు జర్మనీ ఓ వినూత్నమైన ఆలోచన
- February 14, 2018
పెరిగిపోతున్న కాలుష్య మహమ్మారికి బ్రేక్ వేసేందుకు జర్మనీ ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. ప్రజలందరికీ ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఉచిత ప్రయాణం కల్పించాలన్నది ప్రతిపాదన. దీనివల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గిపోతుందన్నది ఆలోచన. 20 ప్రముఖ పట్టణాల్లో నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి యూరోపియన్ ప్రమాణాలను మించిపోవడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 2020 వరకు ఈ కాలుష్యాన్ని నిరోధించలేని పరిస్థితి కూడా ఉంది. ఉచిత రవాణా సౌకర్యం వల్ల అయ్యే వ్యయాలపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అవసరమైతే మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని పంచుకుంటాయని అక్కడి ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేసింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయులు పెరిగిపోయిన పట్టణాల్లో డీజిల్ వాహనాలను నిషేధించే ఆలోచన కూడా చేస్తోంది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







