ప్రివ్యూ: మనసుకు నచ్చింది
- February 15, 2018
నటీనటులు : సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్ అరుణ్
నిర్మాతలు : సంజయ్ స్వరూప్, కిరణ్
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
సినిమాటోగ్రఫీ: రవి యాదవ్
ఎడిటర్ : గౌతమ్ రాజు
మ్యూజిక్ : రధన్
మహేష్‌బాబు సోదరి మంజుల నటిగా, నిర్మాతగా పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగా, నిర్మాతగా పెద్దగా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయిన ఈమె చివరిగా దర్శకురాలిగా తన అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన 'మనసుకు నచ్చింది' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మహేష్‌బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు, సినిమా కోసం పలు సార్లు మీడియా ముందుకు వచ్చాడు. దాంతో 'మనసుకు నచ్చింది' సినిమా గురించి సినీ జనాల్లో చర్చ జరుగుతుంది.
ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనబర్చుతున్నారు.
'మనసుకు నచ్చింది' సినిమా ఆడియో మరియు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సేఫ్ టైంలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం చేశారు.
మంజుల ఈ చిత్రం కథను నిజ జీవిత అంశాల ఆధారంగా రాసినట్లుగా చెప్పుకొచ్చింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ల కాంబో సీన్స్, వారిద్దరి మద్య రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు గెస్ట్‌గా కూడా ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మంజుల కూతురు ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై మరింతగా ఆసక్తి నెలకొంది.
మహేష్‌బాబు ఆశీర్వాదంతో రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే విషయం తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







