ఫ్లై దుబాయ్‌: యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డిస్కౌంట్‌

- February 16, 2018 , by Maagulf
ఫ్లై దుబాయ్‌: యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డిస్కౌంట్‌

ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ (ఎఫ్‌ఎహెచ్‌ఆర్‌), పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్‌ కంపెనీస్‌ - ప్రివిలేజెస్‌ ప్రోగ్రామ్‌ 'ఇంతియాజ్‌'లో ఫ్లై దుబాయ్‌ చేరినట్లు ప్రకటించింది. ఫ్లై దుబాయ్‌, ఫెడరల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 10 శాతం మేర డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గవర్నమెంట్‌ కమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌, ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌కి సంబంధించిన పార్టనర్స్‌ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతియాజ్‌ స్పాన్సరర్స్‌ అయిన ఓఎస్‌ఎన్‌, కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ దుబాయ్‌, ఎటిసలాట్‌, నేషనల్‌ బాండ్స్‌ కంపెనీలనూ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. 46 దేశాల్లోని 100 డెస్టినేషన్లకు గాను ఈ పథకం కింద గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అద్భుతమైన ఆఫర్స్‌ పొందవచ్చునని ఫ్లై దుబాయ్‌ అధికార ప్రతినిథి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com