గ్రాండ్ మాస్క్ వెలుపల సామాను భద్రపరిచే సేవ ఏర్పాటుపై పర్యాటకుల ప్రశంసలు

- February 16, 2018 , by Maagulf
గ్రాండ్ మాస్క్ వెలుపల సామాను భద్రపరిచే సేవ ఏర్పాటుపై పర్యాటకుల ప్రశంసలు

మక్కా : పలువురు పర్యాటకులు మహా మస్జీద్ వెలుపల సామాను భద్రపరిచే సేవ విలువైనదని అభినందిస్తూ ఆ ఏర్పాటుపై మెచ్చుకున్నారు. మసీదు సముదాయంలో మరిన్నీ మెరుగైన సౌకర్యాలను నిర్మించడానికి అధికారులు కృషి చేయాలని వారు కోరారు. సందర్శకులు వారి వ్యక్తిగత వస్తువులను సురక్షిత డిపాజిట్ బాక్సుల్లో నిర్భయంగా వదిలి మసీదు లోపల ప్రశాంతంగా నమాజ్ ను ఆచరించవచ్చు. తమ వస్తువులు దొంగిలించ బడతాయమోనాని అనవసర ఆందోళన ఇకపై చెందనవసరం లేదని మత ఆచారాలను సౌలభ్యంగా కొనసాగించవచ్చని  గ్రాండ్ మసీదు ప్రాంగణంలో సురక్షిత డిపాజిట్ బాక్సుల పర్యవేక్షకుడు ఒమర్ హవాసావి పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాండ్ మసీదు వ్యవహారాల ప్రెసిడెన్సీ కింగ్ అబ్దుల్ ఆజిజ్ గేట్ కు ఎదురుగా ఈ సురక్షిత డిపాజిట్ బాక్స్ ల సౌకర్యాలను ఏర్పాటు చేసింది, దార్ అల్-తవహీద్ ఇంటర్కాంటినెంటల్ హోటల్ ముందు ఆల్-హరమీన్ లైబ్రరీకి సమీపంలో కింగ్ అబ్దుల్లా గేట్ ఎదురుగా ఈ సౌకర్యాలు ఏర్పాటుచేయబడింది. ఒక్కో  సౌకర్యంలో  వివిధ పరిమాణాల గల 320 బాక్సులను కలిగి ఉంది. పెట్టెల అద్దె ధరలు వస్తువుల పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. అద్దె ధరలు గంటకు 2 సౌదీ రియళ్ళ నుంచి ప్రారంభమవుతాయి మరియు పెద్ద పెట్టెలలో వ్యక్తిగత వస్తువులను భద్రపర్చినందుకు గంటకు అద్దె 7 సౌదీ రియళ్ళ వరకు ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా  స్కానర్ తనిఖీలో వారు తేనె లేదా చమురు వంటి ద్రవ పదార్ధాలు ఇక్కడ భద్రపరచడానికి అవకాశం లేదు. ఇవి త్వరగాపాడవుతాయి. సందర్శకుల వస్తువులను ఒకసారి పరిశీలించిన తరువాత,వాటిని సరైన పరిమాణం గల బాక్స్ లో భద్రపర్చవచ్చు.వాటికి తాళం వేయబడింది .ప్రతి పెట్టెకు ఒక నెంబర్ కేటాయించ బడుతుంది. ఆయా వస్తువులతో బాక్స్ ను మూసి  వేసినప్పుడు, బాక్స్ నెంబర్ తో  కాగితపు చీటీ ఒకటి అక్కడ ముద్రితమవుతుంది. ఈ పేపరు ​​పెట్టె ఉపయోగించి తేదీ మరియు సమయం వంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది. పెట్టెలో ఉంచి సెన్సార్ తో  ​​స్కాన్ చేయబడినప్పుడు,ఇది ఆటోమేటిక్ గా తెరవబడుతుంది.ఒక వ్యక్తి గరిష్టంగా ఐదు గంటలు పెట్టెను ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి ఐదు రోజులు తన ఆస్తిని ఈ బాక్స్ లలో వదిలివేసినట్లయితే, భద్రతా అధికారులు ఆ వదిలివేయబడిన సామానుని తనిఖీ చేస్తారు. విలువైన వస్తువులను సరైన యజమానికి  వాటిని అందించేవరకు ఆ మొత్తం వస్తువులు భద్రంగా ఉంచబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com