ఏడాదంతా టీమిండియాకుపెద్ద ఎత్తున వన్డే మ్యాచ్‌లు జాతర

- February 17, 2018 , by Maagulf
ఏడాదంతా టీమిండియాకుపెద్ద ఎత్తున వన్డే మ్యాచ్‌లు జాతర

దిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచకప్‌  జరగబోతున్న నేపథ్యంలో ఆ లోపు భారత్‌ పెద్ద ఎత్తున వన్డే మ్యాచ్‌లు ఆడబోతోంది. ఏడాది కాలంలో దాదాపు 30 వన్డే మ్యాచ్‌ల్లో భారత్‌ తలపడనుందని అంచనా. వచ్చే 12 నెలల్లో భారత్‌ మొత్తం 63 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో దాదాపు సగం వన్డేలే. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం భారత్‌.. వచ్చే నెలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడుతుంది. ఐపీఎల్‌ తర్వాత ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌, వెంటనే బెంగళూరులో అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడతారు. తర్వాత సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన ఉంటుంది. ఆ పర్యటనలో 5 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడతారు. అక్టోబర్లో వెస్టిండీస్‌తో భారత్‌ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు ఆతిథ్యమిస్తుంది. దానికంటే ముందు ఆసియా కప్‌ వన్డే టోర్నీ ఉంటుంది. దాని తేదీలు, వేదిక ఇంకా ఖరారవ్వలేదు. నవంబరు-డిసెంబరు నెలల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత్‌.. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది.

ఆ తర్వాత మొదలయ్యే న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. ఆపై ఆస్ట్రేలియా భారత్‌కు వచ్చి ఐదు వన్డేలు, రెండు టీ20లు ఆడుతుంది. సీజన్‌ చివర్లో సొంతగడ్డపై భారత్‌.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com