ఇక దుబాయిలో కానరాని 'లాస్ట్ మైల్' కష్టాలు - కార్లను అద్దెకు తీసుకొనే యోచనలో అర్.టి.ఎ.
- November 26, 2015
రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ , దుబాయిలో 'లాస్ట్ మైల్' ను చేరడానికి అద్దె ర్లను వినియోగించే విషయమై సుదీర్ఘ చర్చలలో ఉంది. 'లాస్ట్ మైల్' అంటే ఒక వ్యక్తీ మెట్రో, రైలు, ట్రాం లేదా బస్సు నుండి దిగిన అనంతరం తన గమ్యస్థానం - అంటే ఇల్లు లేదా కార్యాలయానికి చేరడానికి ప్రయనించవలసిన దూరం అని అర్.టి.ఎ. లైసెన్సింగ్ ఏజెన్సీ సి.ఈ.ఓ.అహ్మద్ బహ్రోజ్యాన్ తెలిపారు. ప్రస్తుతం ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేనందున, ఈ దూరం నడక ద్వారా అధిగమించవలసి వస్తున్నప్పటికీ, అనేక మంది దుబాయి వాసులు, ముఖ్యంగా వేసవికాలంలో ఇందుకు ఇష్టపడడం లేదు. ఈ విధమైన 'కార్ రెంటల్' విధానం ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, జర్మనీ, నెదర్లండ్స్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విజయవంతమయిందని, ఇందుకోసం ఎలక్ట్రానిక్ కార్లు, పోడ్ కార్లు మరియు చోదక రహిత వాహనాలు కూడా పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







