జి.సి.సి. అంతరంగిక శాఖా మంత్రులతో కతార్ డిప్యుటీ ఎమిర్ మంతనాలు
- November 26, 2015
దోహా లో జరిగిన 34 వ సలహా సంఘ సమావేశంలో, కతార్ డిప్యుటీ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్-థాని, గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్ రాజ్యాల అంతరంగిక మంత్రులతో సమావేశమై, సభ్య దేశాల మధ్య సంబంధాలను గురించి చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కతార్ మరియు ఆంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా బిన్ థానితో బాటు, సౌదీ అరేబియా యువరాజు, రెండవ ఉప ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్డులజీజ్ అల్- సౌద్, యు.ఎ.ఈ. ఉపప్రధాని మరియు అంతరంగిక శాఖా మంత్రి లెఫ్టనెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్, కువైట్ ఉపప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి - షేక్ మొహమ్మద్ అల్-ఖలీద్ అల్-హమాద్ అల్-సాబా, బహరేన్ ఆంతరంగిక శాఖా మంత్రి లెఫ్ట నెంట్ జనరల్ షేక్ రాషిద్ బిన్ అబ్దుల్లా అల్-ఖలీఫా ,ఒమాన్ ఆంతరంగిక శాఖా మంత్రి సయ్యిద్ హమౌద్ బిన్ ఫైజల్ అల్-బుసైదీ మరియు జి.సి.సి. సెక్రటరీ జనరల్ డా. అబ్దుల్ లతీఫ్ బిన్ రషిద్ అల్- జయాని లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







