సౌదీ అరేబియా లో మహిళలకు మరింత స్వేచ్ఛ
- February 18, 2018
సౌదీ అరేబియా:ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సౌదీ అరేబియా కీలక సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. మహిళలు ఇక భర్త, పురుష బంధువుల అనుమతి లేకుండానే సొంత వ్యాపారం చేపట్టవచ్చని సౌదీ సర్కార్ పేర్కొంది. దశాబ్ధాల తరబడి సౌదీలో రాజ్యమేలుతున్న సంరక్షక వ్యవస్థకు దూరంగా నూతన విధాన మార్పుగా ఈ చర్యను అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సౌదీ గార్డియన్‌షిప్ పద్ధతి ప్రకారం మహిళలు ఎలాంటి వ్యాపారం చేపట్టాలన్నా..విద్యాసంస్థల్లో ప్రవేశానికి, ప్రయాణాలకు పురుష సంరక్షకుని నుంచి అనుమతి పత్రం అవసరం ఉంది. తాజాగా ఇలాంటి అనుమతులు అవసరం లేదని వాణిజ్య, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ముడిచమురు ఉత్పాదన ద్వారా ఇబ్బడిముబ్బడిగా రాబడులు ఆర్జించిన సౌదీ అరేబియా ప్రస్తుతం ఆ రాబడి గణనీయంగా తగ్గడంతో దేశంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, మహిళా ఉపాధిని విస్తరించడం వంటి చర్యల దిశగా కీలక సంస్కరణలకు మొగ్గుచూపుతోంది. మహిళలపై పలు ఆంక్షలున్న సంప్రదాయ ముస్లిం రాజ్యంలో మహిళా పరిశోధకులను నియమించనున్నట్టు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







