సౌదీ అరేబియా జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్న ఏ.పి వాసులు
- February 18, 2018

సౌదీ అరేబియా:సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో సౌదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రియాధ్‌లోని ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్ అంథోని ఆంధ్రప్రదేశ్ స్టాల్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడి, పర్యాటక రంగంలో ఉన్న అవకాశాల గురించి సందర్శకులకు వివరించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ గతవారం ప్రారంభించిన జనాద్రీయ ఉత్సవాలకు కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కూడా ప్రత్యేకంగా హాజరైన సంగతి తెలిసిందే. భారత్‌కు కేటాయించిన ప్రత్యేక స్థలంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని నిర్వహించారు. భారతీయ రాయబారి అహ్మద్ జావెద్ ఇతర సీనియర్ దౌత్యవేత్తలు, సౌదీ అరేబియా అధికారులు, ఆంధ్రపదేశ్ వేదికను సందర్శించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తరుణ్,వర్మ,సుమన్,సత్యం,విజయ ఆంథోనీకి మరియు క్లాసికల్ డాన్సర్స్ నమ్రత,రిత్విక,అశోక్ కు అంథోని ధన్యవాదాలు తెలియజేసారు.




తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







