హైదరాబాద్: మార్చి 4న ఫుడ్ ట్రక్ ఫెస్టివల్
- February 18, 2018
నచ్చిన రుచుల కోసం ఎక్కడెక్కడికో పరుగుపెట్టే రోజులుపోయి... మన ముందుకే అవి వచ్చి వాలే కాలంలో ఉన్నాం. ఒకప్పుడు వీధి పక్కన ఏ తోపుడు బండిపైనో లోకల్ ఫుడ్ అలరిస్తుండేది. కానీ.. ఇప్పుడు తీరొక్క రుచులూ... మీ ముంగిటకే వచ్చి వాలుతున్నాయి. అవును... ఇప్పుడు మెట్రో నగరాల్లో జన సామాన్య ఆకలి తీరుస్తున్న నయా రెస్టారెంట్లు ఫుడ్ ట్రక్‌లే. ఇప్పుడు ఒకచోటకు చేరి మీ మనసుకు నచ్చే రుచులను అందించనున్నాయి. అందుకు మాదాపూర్‌లోని ఎలైట్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ హైదరాబాద్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్‌కు వేదికగా మారనుంది. అల్పాహారం నుంచి బిర్యానీ వరకు, ఐస్ క్రీం నుంచి పావ్ బాజా వరకు, దోష నుంచి దాల్ రైస్ వరకు.. ఏది కావాలన్నా ఇప్పుడు రెస్టారెంట్‌కి పరుగు పెట్టాల్సిన పని లేదు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్తే చాలు.. రోడ్డు పక్కన ఓ ఫుడ్ ట్రక్ రెడీగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి ఫుడ్ ట్రక్స్ కనిపిస్తాయి. ఘుమఘుమలాడే రుచుల్ని అందిస్తాయి.
డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్‌తో అలరించే ట్రక్స్ అన్ని మార్చి 4వ తేదీన ఒక చోట చేరనున్నాయి. టిక్స్ డూ, జక్స్‌టపోజ్, స్టార్టప్ హైదరాబాద్, స్టూమ్యాగ్జ్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్ సీజన్ 2లో వందలాది ట్రక్స్ హైదరాబాదీలను అలరించనున్నాయి. నోరూరించే రుచులు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, హైదరాబాదీ ఇలా అన్ని రకాల రుచులను ఒక చోట చేర్చే వేదిక హైదరాబాద్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్ రోజంతా మీకు నచ్చిన ఫుడ్‌ని ఆస్వాదించేందుకు ఈ ఫెస్టివల్‌ని సందర్శించాల్సిందే. మాదాపూర్‌లోని ఎలైట్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ ఫెస్టివల్‌లో రకరకాల వంటలతో మ్యూజిక్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నగర వాసులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.
డిఫరెంట్ ఫుడ్‌ని టేస్ట్ చేయాలనుకుంటే ఈ ఫెస్టివల్‌ని మీరూ సందర్శించండి మరి.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







