వైరల్ ఫీవర్ నుంచి త్వరగా కోలుకోవాలంటే??

- November 26, 2015 , by Maagulf
వైరల్ ఫీవర్ నుంచి త్వరగా కోలుకోవాలంటే??

వైరల్ ఫీవర్ ప్రస్తుతం కామన్ హెల్త్ ఇష్యూగా మారింది. ఇది వయసుతో సంబంధం లేకుండా వేధిస్తోంది. చాలావరకు విశ్రాంతి, ద్రవపదార్థాల ద్వారా వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని ప్రాక్టికల్ గా మంచి ఫలితాన్నిచ్చిన పద్ధతుల ద్వారా 10 రోజుల్లో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. వైరల్ ఫీవర్ & జాయింట్ పెయిన్స్ నివారించే హోం రెమెడీస్ వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇమ్యూన్ సిస్టమ్ పై ప్రభావం పడుతుంది. దీనివల్ల చాలా అనారోగ్యంగా అనిపిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా.. చాలా సమస్యలు వస్తాయి. చర్మంపై దురదలు, ఎర్రగా మారడం, జుట్టు రాలిపోవడం, అలసటగా అనిపించడం ప్రధానంగా కనిపిస్తాయి. వైరల్ ఫీవర్ బాధ నుండి ఉపశమనం కలిగించే ఆహారాలు వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపించగానే ముందుగా.. హోం రెమిడీస్ ప్రయత్నించడి. కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. వైద్యులను సంప్రదించకుండా సొంతంగా మందులు వేసుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, విటమిన్స్, మినరల్స్ తీసుకోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు. దీంతో పాటు ఎలాంటి నియమాలు ఫాలో అవడం వల్ల వైరల్ ఫీవర్ నుంచి బయటపడవచ్చో చూద్దాం... వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డీహైడ్రేషన్ సాధారణ లక్షణం. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి శరీరాన్ని కాపాడటం చాలా అవసరం. కాబట్టి పళ్ల రసాలు, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగడం చాలా అవసరం. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా.. ఇమ్యూన్ సిస్టమ్ పై చాలా ప్రభావం పడుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశముంది. కాబట్టి.. ముందు జాగ్రత్తలు పాటించాలి. పరిశుభ్రత పాటించాలి. వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ పనులు చేయడం వల్ల.. ఇంకా ఎక్కువ అలసిపోయే అవకాశముంది. కాబట్టి రెస్ట్ తీసుకోవడం, రిలాక్స్ ఉండటానికి ప్రయత్నించాలి. దీనివల్ల శరీరం మామూలు స్థితికి రావడానికి తోడ్పడుతుంది. హెల్తీ డైట్ ఫాలో అవడం చాలా అవసరం. ఇది రోగనిరోధక శక్తి 10 రోజుల్లోనే పెరుగడానికి సహాయపడుతుంది. ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా.. చర్మంపై దద్దుర్లు, దురద, మచ్చలు, పొక్కులు ఇబ్బందిపెడతాయి. అలాంటి లక్షణాలు కనిపించగానే డాక్టర్ ని సంప్రదించి మందులు తీసుకోవడం మంచిది. ఇమ్యునిటీ పవర్ పెంచే ఆహార పదార్థాలు తీసుకునేలా జాగ్రత్తపడాలి. విటమిన్ సీ, జింగ్, విటమిన్ డి ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపించగానే వాటిని తగ్గించుకునే మార్గాలు వెతుక్కోవాలి. కాబట్టి సొంతంగా ఏవి పడితే అవి మందులు వేసుకోకూడదు. దీనివల్ల సమస్య ఇంకా పెరిగే అవకాశముంది. యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాకి వాడతాం.. వైరస్ కి కాదనేది గుర్తుంచుకోవాలి. వైరల్ ఫీవర్ నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఇది చక్కటి పరిష్కారం. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నవాళ్లు హెర్బల్ టీ తాగడం విషయంలో డాక్టర్ ని సంప్రదించడం మంచిది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com