మంచినీళ్ల బాటిల్ తో మత్తు పదార్ధాలను రహస్య సంకేతాలతో విక్రయిస్తున్న ఆసియా దేశ నిందితులు..
- February 19, 2018
షార్జా : నీళ్ల బాటిళ్లతో పోలీసుల కళ్ళు కప్పాలని చూశారా నిందితులు..కానీ అడ్డంగా దొరికిపోయారు. మత్తు కల్గించే పదార్ధాలు విక్రయిస్తే దారుణమైన శిక్షలు ఆ దేశాలలో ఉంటాయని స్పష్టంగా తెల్సినప్పటకి కొందరు డబ్బు మోజులో పడి ప్రాణాలకు తెగించి అక్రమ రవాణా చేయబోయి అధికారులకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు జీవనోపాధి కోసం యూఏఈ వెళ్లారు. అడ్డదారిలో అధిక డబ్బు సంపాదించాలనే కక్కుర్తితో మాధకద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడ్డారు. మాధకద్రవ్యాల రవాణా చేయడంతోపాటు వారి ఇంట్లోనే ఆ మత్తు పదార్ధాలను రహస్యంగా నిల్వ చేశారు. డ్రగ్స్ అమ్మకానికి పాల్పడ్డారు. తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ అక్రమరవాణాకు నిందితులు ఉపయోగించిన రహస్య సాంకేతిక బాష పోలీసులు వెల్లడించారు. వాటర్ బాటిల్‌ను చేతితో పట్టుకున్న వ్యక్తి వద్ద మాదకద్రవ్యాలు విక్రయిస్తాడు. మత్తు పదార్ధాలు కొనుక్కోవాలనే వ్యక్తి కూడా వాటర్ బాటిల్ చేతపట్టుకుని ఉండాలి. ఎవరికీ అనుమానం రాకుండా, ఎలాంటి సంభాషణా లేకుండా ఈ కోడ్ భాషను ఉపయోగించేవారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పూర్తిగా సమాచారం అందుకున్న తర్వాతే నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణ మార్చి 12కు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







