మైనర్‌పై లైంగిక దాడి యత్నం: టీచర్ అరెస్ట్
- February 19, 2018
దుబాయ్:దుబాయ్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్, ఓ టీచర్‌ని సస్పెండ్ చేసింది. అమెరికాలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఏడేళ్ళ వయసున్న చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు నిందితుడు. స్విస్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్కూల్ - దుబాయ్ ఈ విషయాన్ని వెల్లడించింది. స్కూల్‌లో సెకెండరీ టీచర్‌గా పనిచేస్తున్న విలియం బాల్‌పై మీడియాలో వచ్చిన కథనాల మేరకు అతనిపై సస్పెన్షన్ వేటు వేశామని తెలిపారు. ఫిబ్రవరి 5న అమెరికాలోని ఫ్లోరిడాలో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ చిన్నారి కోసం విమానంలో 5,000 డాలర్లు ఖర్చు చేసి అమెరికాకి వెళ్ళాడు. అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో యూఎస్ మార్షల్స్ అతని దగ్గర చిన్న పిల్లల కోసం పలు వస్తువుల్ని అలాగే కండోమ్స్, ల్యూబ్రికెంట్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నెట్‌లో ఇద్దరి మధ్యా చాలా కన్వర్జేషన్ నడిచిందనీ, పూర్తి ఆధారాలతో మైనర్‌తో సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అభియోగాల్ని పోలీసులు నమోదు చేశారని అధికారులు తెలిపారు. దుబాయ్‌లోని స్విస్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్కూల్‌లో బాల్, మ్యూజిక్ టీచర్‌గా పనిచేశాడు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







