అభిమాని కుటుంబానికి 15లక్షలతో ఇల్లు కట్టించిన రాఘవేంద్ర లారెన్స్

- February 19, 2018 , by Maagulf
అభిమాని కుటుంబానికి 15లక్షలతో ఇల్లు కట్టించిన రాఘవేంద్ర లారెన్స్

సినిమాల్లో హీరోగా చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలను తీర్చే వ్యక్తిగా నటిస్తారు.. కానీ తెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా కొంత మందే హీరోలుగా జీవిస్తారు. అలా వెండి తెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి లారెన్స్.. సామాజిక సృహ ఉన్న వ్యక్తి.. ఇప్పటికే తాను స్థాపించిన ట్రస్ట్ ద్వారా వికలాంగులను అనాథలకు ఆశ్రయం ఇస్తూనే.. అనేక మంది పేదపిల్లలకు వైద్య సహాయం అందిస్తున్నారు. అంతేకాదు.. ఎవరు ఆపదలో ఉన్నా.. ఆర్ధిక సాయం అందిస్తున్నారు. తన పిలుపుకి స్పందించి జల్లి కట్టు ఉద్యమంలో పాల్గొని.. మరణించిన అభిమాని కుటుంబానికి అన్నలా అండగా నిలిచారు. ఇల్లు కట్టించి ఇచ్చారు. గత ఏడాది తమిళనాడులో జరిగిన జల్లి కట్టు ఉద్యమంలో లారెన్స్ మద్దతు ఇవ్వడంతో పాటు.. స్వయంగా పాల్గొన్నారు.. లక్షలాది మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు. అప్పుడు జరిగిన ఆందోళనలో యోగేశ్వర్ అనే యువకుడు మృతి చెందాడు.. అతను తన అభిమాని అని తెలిసి లారెన్స్ వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. యోగేశ్వర్ కు మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నట్లు తెలుసుకొన్న లారెన్స్ ఇల్లు కట్టించడం మొదలు పెట్టాడు. ఆ ఇల్లు ఇటీవలే పూర్తి అయ్యింది. ఫిబ్రవరి 7న యోగేశ్వర్ కుటుంబం గృహప్రవేశం చేసింది. ఆ ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల ఖర్చు అయింది అని ఫ్యాన్స్ చెబుతున్నారు.. అంతేకాదు.. యోగేశ్వర్ తల్లిదండ్రుల పట్ల.. ఆ కుటుంబం పట్ల లారెన్స్ ఎంతో భాద్యతగా వ్యవహరిస్తున్నారట.. దీంతో లారెన్స్ మంచి మనసున్న రియల్ హీరో అని అంటున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com