33 వీసా అప్లికేషన్ల ఫోర్జరీ: నిందితుడికి 3 ఏళ్ళ జైలు
- February 19, 2018
దోహా:33 వీసా అప్లికేషన్లను ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. బిజినెస్ ఓనర్ (బాధితుడి) సిగ్నేచర్ని సేకరించి, వీసాల్ని జారీ చేసేందుకోసం దాన్ని నిందితుడు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. తాను పనిచేసిన సంస్థ తాలూకు వివరాల్ని, యజమాని వివరాల్ని చాకచక్యంగా దొంగిలించి, వాటితో అప్లికేషన్లను ఫోర్జరీ చేశాడు. ఏడాది కాలంలో 600 వీసాల్ని ప్రాసెస్ చేయగా, ఇందులో 33 ఫోర్జరీవని అధికారులు విచారణలో నిర్ధారించారు. ఫోర్జరీ గురించి తెలియగానే యజమాని పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోఎయకి వచ్చింది. 3 ఏళ్ళ జైలు శిక్ష అనంతరం, నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా కూడా కోర్టు తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







