తెలంగాణ, దక్షిణ భారత సాహిత్య ఉద్యమాలు ఈ నెల 22న సమాలోచన
- February 19, 2018
హైదరాబాద్: తెలంగాణ, దక్షిణ భారత సాహిత్య ఉద్యమాల సమాలోచన సదస్సు ఈ నెల 22న ప్రారంభం కానుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, నిజాం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు డా.కసప నరేందర్ తెలిపారు. నిజాం కళాశాల ఆడిటోరియంలో ఉదయం ఉన్నత విద్యా మండలి ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ప్రారంభిస్తారని, ఓయూ వీసీ డా.శిరందాస్ రామచంద్రం, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొంటారన్నారు. 23న ముగింపు సభకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్‌రెడ్డి, పీయూ వీసీ ప్రొఫెసర్ బి.రాజరత్నం, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, ఓయూ తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ వి.నిత్యానందరావులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ సాహిత్యంపై ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ కీలకోపన్యాసం చేస్తారన్నారు. సదస్సులో ఎనిమిది సమావేశాలు ఉంటాయన్నారు. దక్షిణ భారత సాహిత్య ఉద్యమాలపై, తెలంగాణలోని 117 సంవత్సరాల సాహిత్య వికాసంపై 42 మంది పత్ర సమర్పణలు చేస్తారన్నారు. సమావేశాల్లో అతిథులుగా ప్రొ.టి.కృష్ణారావు, డా.ఏనుగు నరసింహారెడ్డి, ఎ.సత్యనారాయణరెడ్డి, అంపశయ్య నవీన్, డా.ఆయాచితం శ్రీధర్, ప్రొఫెసర్ .ఎన్.కిషన్, ఎం.విజయభగవాన్, సుద్దాల అశోక్‌తేజ పాల్గొంటారని వెల్లడించారు.
అధ్యక్షులుగా ప్రొఫెసర్ మసన చెన్నప్ప, ప్రొఫెసర్ ఎస్వీ రామారావు, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్, ప్రొఫెసర్ గుండెదప్పు కనకయ్య, డా.శ్రీరంగాచార్య, డా.ధనంజయ్‌నాయక్ ఉంటారన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







