ఐఎస్‌లో చేరిన టర్కీ మహిళకు ఇరాక్‌లో మరణశిక్ష
- February 19, 2018
బాగ్దాద్ : ఐఎస్‌లో చేరిన టర్కీ మహిళను ఇరాక్‌లోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఉగ్రసంస్థలకు మద్దతు తెలపడం, ఉగ్రసంస్థల్లో చేరడం లేదా చేర్పించడం చట్ట ప్రకారం పెద్ద నేరంగా పరిగణిస్తామని తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా, ఐఎస్ శిబిరాల్లో శిక్షణ పొందిన మరో 10 మంది విదేశీ మహిళలకు జీవితఖైదు విధించినట్టు వెల్లడించారు. తాము వెలువరించిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్టు జడ్జీ తెలిపారు. ఉగ్రసంస్థల పట్ల ఆకర్షితులవుతున్న యువత పెద్ద సంఖ్యలో ఐఎస్‌లో చేరుతున్నారు. సిరియా, ఇరాక్ దేశాలకు వెళ్లి ఉగ్రశిబిరాల్లో చేరుతున్నారు. దీంతో, ఉగ్రసంస్థలను నియంత్రించే దిశగా ఇరాక్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. దాడుల్లో పట్టుబడ్డ ఉగ్రవాదులను విచారించి సమాచారం రాబట్టుతున్నది. దోషులుగా తేలిన మిలిటంట్లను శిక్షిస్తున్నది. ఇరాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ జర్మనీకి చెందిన ఓ మహిళకు గతనెలలో ఉరిశిక్ష విధించినట్టు ఇరాక్ ప్రభుత్వం పేర్కొన్నది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







