జి స్ టి వర్మను అరెస్టు చేయండి - సీఎం

- February 21, 2018 , by Maagulf
జి స్ టి వర్మను   అరెస్టు చేయండి - సీఎం

  రాంగోపాల్ వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌పై మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. మహిళలను కించపర్చిన వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఆర్జీవీపై హైదరాబాద్‌లో కేసులు నమోదుకాగా.. ఇప్పుడు విశాఖ పోలీసులు సైతం ఆయనకు షాకిచ్చారు.

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరో షాక్‌ తగిలింది. జీఎస్‌టీ ఉచ్చు ఆయన మెడకు బిగుసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసుల ఎదుట ఆర్జీవీ విచారణకు హాజరవ్వగా.. ఇప్పుడు ఏపీలో సైతం కేసులు నమోదయ్యాయి.

రాంగోపాల్ వర్మపై విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోర్న్ వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళా సంఘాల ఆందోళనతో వర్మపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ని హోంమంత్రి చినరాజప్ప ఆదేశించారు.

అంతకుముందు రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలంటూ విశాఖలో మహిళా జేఏసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనకు సామాజిక కార్యకర్త దేవి మద్దతు తెలిపారు. సీఎం చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకుంటే... తక్షణమే వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

వర్మ తీసిన జీఎస్‌టీ చిత్రం అసభ్యకరంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉందంటూ సామాజిక ఉద్యమకారిణి దేవి హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒకసారి రాంగోపాల్‌ వర్మను హైదరాబాద్‌ పోలీసులు విచారించారు. విచారణ కొనసాగనున్న నేపథ్యంలోనే తాజాగా విశాఖలో కేసు నమోదు కావడంతో... వర్మకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com