వీసా కోసం చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ
- February 21, 2018
50 ఏళ్ళ వ్యక్తి ఒకరు, చనిపోయిన వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మృతుడు జిసిసి జాతీయుడు కాగా, అతని పేరు మీద వీసా పొందేందుకు ప్రయత్నించాడు నిందితుడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు అఫీషియల్ డాక్యుమెంట్ స్టాంపింగ్ అయ్యాక, ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. షార్జా న్యాయస్థానం ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది గత డిసెంబర్‌లో. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - షార్జాలో ఫోర్జరీ చేసిన దరఖాస్తుని నిందితుడు సమర్పించాడు. మహమౌద్ పేరుతో నిందితుడు ఈ డాక్యుమెంట్‌ని ఇచ్చాడు. తన రెసిడెన్స్ వీసాని రెన్యువల్ చేయడానికి ప్రయత్నించాను తప్ప, ఎలాంటి నేరానికి పాల్పడలేదని నిందితుడు చెప్పగా, నిందితుడి తరఫు లాయర్ సలెమ్ సాహో తన క్లయింట్‌ని బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి