ఓవర్సీస్ లో ఫ్యాన్సీ రేట్ కు '47డేస్'
- February 22, 2018
సత్యదేవ్, పూజా ఝవేరీ జంటగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. సినిమాపై ముందు నుంచీ విపరీతమైన పాజిటివ్ టాక్ ఉంది. ఈ నేపథ్యంలో 47డేస్ ఓవర్శీస్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైపోయాయి. త్రిశూల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయబోతోంది. ఇందుకోసం ఫ్యాన్సీ రేట్ ను చెల్లించి మరీ హక్కులు కొనడం విశేషం.
ఈ మధ్య వస్తోన్న థ్రిల్లర్ మూవీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అందుకే ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ ఫిలిమ్స్ ఫ్యాన్సీ రేట్ కు ఈ హక్కులు దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెబుతోంది మూవీ టీమ్. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా వస్తోన్న ఈ చిత్రంలో లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కూ మంచి స్కోప్ ఉంటుంది. రఘు కుంచె సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఓ పాటను ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. నూతన గాయని నీహా పాడిన ‘క్యా కరూ మై క్యా కరూ’ అనే మెలోడీకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గాయని నీహా టాలెంట్ చూసిన ప్రతి ఒక్కరూ టాలీవుడ్ కు మరో అందమైన గాత్రం దొరకిందని ప్రశంసిస్తున్నారు. ఈ పాటతో తను మరో ప్రియా ప్రకాష్ వారియర్ అయిపోతుందంటున్నారు. శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 47 మిస్టరీ అన్ ఫోల్డ్ ను ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







