2వ ఎడిషన్ 'భారత్ కో జానియే' క్విజ్ 2018-19
- February 22, 2018
మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్, రెండవ ఎడిషన్ 'భారత్ కో జానియె' (బికెజె) క్విజ్‌ని, నిర్వహించనుంది. మాతృదేశం పట్ల ఓవర్సీస్ ఇండియన్స్‌లో అవగాహన పెంచేందుకోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండు డిస్టింక్ట్ కేటగిరీల్లో ఈ క్విజ్ నిర్వహించబడుతుంది. పిఐఓ (పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్), ఎన్‌ఆర్‌ఐ (నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా) ఆ రెండు కేటగిరీలు. నాలుగు రౌండ్లలో క్విజ్ నిర్వహించబడుతుంది. ఫస్ట్ రౌండ్ క్విజ్ ఆన్‌లైన్ లేదా లోకల్‌గా మే 2018లో నిర్వహించబడుతుంది. ప్రతి కేటగిరీలో టాప్ త్రీ విన్నర్స్‌కి గోల్డ్ మెడల్స్ అందజేస్తారు. వారికి రెండో రౌండ్ క్విజ్ (ఆన్‌లైన్) ద్వారా నిర్వహిస్తారు. న్యూ ఢిల్లీలోని మినిస్ట్రీ నిర్వహిస్తుంది. మూడవ మరియు నాలుగవ రౌండ్స్ (సెమీ ఫైనల్, ఫైనల్ రౌండ్) ఇండియాలో అదీ ఢిల్లీలో మినిస్ట్రీ దీన్ని నిర్వహిస్తుంది. ఆన్ సైట్ క్విజ్ కోసం ఆహ్వానించబడేవారు (3, 4 రౌండ్లు) న్యూ ఢిల్లీలో నిర్వహించే వర్క్ షాప్‌కి హాజరవుతారు. 'భారత్ కో జానియే యాత్ర 15 రోజులపాటు ఇండియాలో జరుగుతుంది. యాత్ర తర్వాత ఫైనల్ రౌండ్ ఢిల్లీలో జరుగుతుంది. ముగ్గురు విన్నర్స్‌కి ప్రవాసి భారతీయ దివస్ కాన్వెన్షన్ 2019లో మెడల్స్ అందజేస్తారు. అన్ని ఖర్చుల్నీ భారత ప్రభుత్వం భరిస్తుంది. క్విజ్, ఓవర్సీస్ ఇండియన్ యూత్ (18 నుంచి 35 ఏళ్ళలోపువారికి) ఆహ్వానం పలుకుతోంది. పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ యూఏఈలో నివసిస్తున్నవారు ఈ క్విజ్‌లో పార్టిసిపేట్ చేయాలని కాన్సులేట్ జనరల్ కోరుతోంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







