అమితాబ్ బచ్చన్ ట్విటర్ కోసం తనదైన శైలిలో ఓ కవిత్వం
- February 23, 2018
ట్విటర్..నీ కోసం ఇదే నా కవిత్వం
అమితాబ్ బచ్చన్
ముంబయి: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విటర్ కోసం తనదైన శైలిలో ఓ కవిత్వం రాశారు. ఇటీవల తన 2 లక్షల మంది ఫాలోవర్లను ట్విటర్ తొలగించిందని ఈ మాధ్యమం నుంచి తప్పుకొంటానని అమితాబ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇతర సినీ, రాజకీయ ప్రముఖులను ఫాలో అవుతూ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు.
కాగా..తాజాగా అమితాబ్ తన అభిమానుల్ని తగ్గించేసిన ట్విటర్ కోసం ఓ కవిత్వం రాశారు. 'ట్విటర్..నేను ఏదన్నా పోస్ట్ చేద్దామనుకుంటే నువ్వు నన్ను అనుమతించడంలేదు. ఇప్పటికే నా 2 లక్షల మంది ఫాలోవర్లను తగ్గించేశావ్. కనీసం నేను నీకోసం పోస్ట్ చేసిన కవిత్వాన్ని మాత్రం తొలగించకు. నాతో ఇంత దారుణంగా ప్రవర్తించకు. ఓ పక్షి..నీ నివాసం ఎక్కడ? ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చావు. నీకు ఎందరో అభిమానులు ఉన్నారు. భయమనేదే లేదు నీకు. కానీ నీకు కోపం వస్తే మేము ఎక్కడికి వెళ్లాలి? నీ ఆశీర్వాదాలు మాపై ఉంటే మా పదాలను పువ్వుల్లా నీపై కురిపిస్తాం' అంటూ సరదాగా పేర్కొన్నారు బిగ్‌బి.
ఈ కవిత్వం చూసిన నెటిజన్లు కనీసం దీన్ని చూసైనా ట్విటర్ తొలగించిన ఫాలోవర్లను తిరిగి అమితాబ్‌కు ఇచ్చేస్తుందని సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ '102 నాటౌట్', 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', 'బ్రహ్మాస్త్రా', 'సైరా నరసింహారెడ్డి' చిత్రాల్లో నటిస్తున్నారు. '102 నాటౌట్' చిత్రంలోనూ బిగ్‌బి ఓ పాటను ఆలపించబోతున్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







