ఇండిగో అహంకారం?: ప్రయాణికుడిని లోపలికి అనుమతించని వైనం..

- February 23, 2018 , by Maagulf
ఇండిగో అహంకారం?: ప్రయాణికుడిని లోపలికి అనుమతించని వైనం..

న్యూఢిల్లీ: సమయానికి ఎయిర్‌పోర్టుకు చేరుకోనివాళ్లకు బోర్డింగ్ పాస్ ఇవ్వకపోవడం సహజమే. కానీ తీరా బోర్డింగ్ అయిపోయి.. ఎయిర్‌పోర్ట్ బస్సులో విమానం వద్దకు వెళ్లాక.. అనుమతి లేదంటే ఎలా ఉంటుంది?. హైదరాబాద్‌లో ఓ ప్రయాణికుడు గురువారం ఇటువంటి అనుభవాన్నే చవిచూశాడు.

తనకు ఎదురైన చేదు అనుభవంపై అతను మీడియాతో మాట్లాడాడు. 'ఈ ఉదయం గోవా వెళ్లే ఇండిగో ఫ్లైట్ 6E-743లో మేము వెళ్లాల్సి ఉంది. విమానం 5.40గం.కు బయలుదేరాల్సి ఉండగా.. మేము 5.22గం.కే విమానశ్రయానికి చేరుకున్నాను.

బోర్డింగ్ అయిపోయాక బస్ ద్వారా ఎయిర్‌పోర్ట్ విమానం వద్దకు చేరుకున్నాం. కానీ అక్కడికెళ్లాక మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. ఆలస్యంగా వచ్చామన్న కారణంతో మమ్మల్ని విమానం ఎక్కనివ్వలేదు.

నాతో పాటు నా భార్య, చిన్న బాబు ఉన్నారు. వారిని కూడా అనుమతించలేదు. ఇదంతా ఇండిగో అహంకార వైఖరికి నిదర్శనం. వాళ్ల అంతర్గత సమస్యలు ఏమైనా ఉండవచ్చు. అలా అని ప్రయాణికులను ఇబ్బంది పెడుతారా' అంటూ అసహనం వ్యక్తం చేశారు సదరు ప్రయాణికుడు.

ఒకవేళ నిజంగానే తాము బోర్డింగ్ టైమ్ కంటే ఆలస్యంగా వచ్చి ఉంటే.. ఎయిర్ పోర్టు బస్సు లోపలికే అనుమతించేవాళ్లు కాదని ఆ ప్రయాణికుడు వాదించాడు. ఆ ప్రయాణికుడు తనకు ఎదురైన అసౌకర్యం గురించి మాట్లాడిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే సదరు ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ.. అతన్ని మరో విమానం ద్వారా గోవా పంపించినట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com