రియాల్టీ టీవీ స్టార్ కైలి జెన్నర్ ట్వీట్‌తో 130 కోట్ల డాలర్ల నష్టం..

- February 23, 2018 , by Maagulf
రియాల్టీ టీవీ స్టార్ కైలి జెన్నర్ ట్వీట్‌తో 130 కోట్ల డాలర్ల నష్టం..

లాస్ ఏంజిల్స్: ఓ స్టార్ కోపం ఓ కంపెనీకి పెద్ద నష్టాన్ని మిగిల్చింది. రియాల్టీ టీవీ స్టార్ కైలి జెన్నర్.. తాజాగా స్నాప్‌చాట్‌పై ఓ ట్వీట్ చేశారు. స్నాప్‌చాట్ మెసేజింగ్ యాప్‌ను తాను ఇక వాడడం లేదంటూ ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో స్నాప్ కంపెనీకి సుమారు 130 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ట్వీట్ చేసిన ఒక్క రోజులోనే ఆ కంపెనీ షేర్లు దారుణంగా 8 శాతం పడిపోయాయి. అయితే ఇటీవల స్నాప్ కంపెనీ తన మెసేజింగ్ యాప్‌ను రీడిజైన్ చేసింది. ఆ డిజైన్ పట్ల యూజర్లు ఆగ్రహాంగా ఉన్నారు. ఎక్కువగా యాడ్స్ ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సెలబ్రటీ కిమ్ కర్దాషియన్ సోదరి అయిన జెన్నర్ ట్వీట్‌తో స్నాప్ మార్కెట్ ఒక్కసారిగా డీలాపడింది. స్నాప్‌చాట్‌ను ఎక్కువగా సెలబ్రిటీలు వాడుతుంటారు. అయితే స్నాప్ యాప్ డిజైన్‌ను మళ్లీ మార్చాలంటూ సుమారు పది లక్షల మంది పిటీషన్‌పై సంతకాలు చేశారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ నుంచి స్నాప్‌చాట్‌కు విపరీతమైన పోటీ వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com