శ్రీకాంత్ 'రా..రా..' మూవీ రివ్యూ
- February 23, 2018
జానర్ : కామెడీ హారర్
నటులు : శ్రీకాంత్, నజియా, సీతా నారాయణ, జీవా, గెటప్ శ్రీను, వేణు, పోసానీ కృష్ణమురళీ, రఘు బాబు తదిదరులు
సంగీతం : రాప్ రాక్ షకీల్
నిర్మాత : ఎం. విజయ్
ఒకప్పుడు హీరోగా దూసుకెళ్లి, మధ్యలో సపోర్టింగ్ రోల్స్ లోనూ మెప్పించిన హీరో శ్రీకాంత్. విలన్‌గా కూడా ట్రైచేసిన శ్రీకాంత్ ప్రేక్షకులకు చేరువకాలేకపోయాడు. తొలిసారిగా హారర్ సినిమా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. టాలీవుడ్లో హారర్ ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో మరి శ్రీకాంత్ చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా?.. చాలా కాలంగా సరైన బ్రేక్కోసం చూస్తున్న ఆయనకు ఈ సినిమా ఏ మేరకు బూస్ట్ ఇచ్చిందో తెలుసుకుందాం.
కథ : రాజ్‌కిరణ్ ( శ్రీకాంత్) తండ్రి ( గిరిబాబు) ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. గిరిబాబు తీసిన వంద సినిమాల్లో ఒక్కటి తప్పా మిగిలినవన్నీ హిట్ సినిమాలు తీసిన గొప్ప దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో రికార్డు కెక్కుతాడు. అతని కొడుకు (శ్రీకాంత్) డైరెక్టర్ కావాలనుకుంటే నిర్మాతలు క్యూ కడతారు. అయితే తీసిన ప్రతి సినిమా బెడిసికొడుతుంది. చివరకు ఒక సినిమాను గిరిబాబు ప్రొడ్యూస్ చేస్తాడు. సినిమా రిజల్ట్ రివర్స్ కావడంతో గుండె ఆగి చనిపోతాడు. అది చూసి శ్రీకాంత్ తల్లికి గుండెపోటు వస్తుంది. ఆమెను బతికించుకోవాలంటే తనకు సంతోషంగా ఉండే పని చేయమని డాక్టర్స్ రాజ్‌కిరణ్‌కు సలహా ఇస్తారు. తల్లి సంతోషంగా ఉండాలంటే కనీసం ఒక్క హిట్ సినిమా తీస్తే చాలనుకుంటాడు. అయితే హిట్ సినిమా తీయడానికి రాజ్‌కిరణ్ పడ్డ కష్టాలేంటీ? సినిమా తీసే ప్రయత్నంలో దెయ్యాలతో వచ్చిన ఇబ్బందులేమిటీ? అసలు దెయ్యాలుండే ఇంటికి రాజ్‌కిరణ్ ఎందుకు వెళ్లాడు? సినిమా ఎవరితో తీశాడు? అది హిట్టా లేక ఫట్టా ? వీటికి సమాధానాలే రా..రా.. సినిమా.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి