ప్రొడక్షన్ హౌస్ - మహేష్!
- May 05, 2015
మహేష్‌బాబు.. న్యూ ప్రొడక్షన్ హౌస్ గురించి ఫిల్మ్‌నగర్‌లో రకరకాల వార్తలు జోరందుకున్నాయి. మహేష్‌బాబు- నమ్రత కలిసి ప్రొడక్షన్ హౌస్‌ని నిర్మించాలనే ఆలోచనలో వున్నారని , అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసే అవకాశముందంటూ ఓ వైపు ప్రచారం సాగిపోతోంది. దీనికి ప్రిన్స్ కొడుకు ' గౌతమ్ ' పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. మరి ఇందులో నిజముందా ? ఎందుకంటే కృష్ణ ఫ్యామిలీలో ఇప్పటికే రెండు బ్యానర్స్ వున్నాయి. ఒకటి పద్మాలయా బ్యానర్ కాగా , మరొకటి ఇందిర ప్రొడక్షన్స్. దీనికితోడు ప్రిన్స్ ప్రొడక్షన్ హౌస్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెబ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. నిత్యం షూటింగ్‌లతో బిజీగావుండే మహేష్ , ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం కష్టమేనని అంటున్నారు. సౌత్‌లో సూర్య , అజిత్ వంటి హీరోలకు ఇప్పటివరకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లేదని , అందుకే సంస్థలను ఏర్పాటు చేశారని చెబుతున్నావాళ్లూ లేకపోలేదు. ఒకవేళ మహేష్ సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభిస్తే , స్టార్ హీరోలతో సినిమాలు చేస్తాడా ? లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!









