అమెరికాలో దారుణం... లైబ్రరీలో మహిళ దారుణ హత్య

- February 27, 2018 , by Maagulf
అమెరికాలో దారుణం... లైబ్రరీలో మహిళ దారుణ హత్య

వాషింగ్టన్‌ : అమెరికాలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. పుస్తక పఠనం కోసం లైబ్రరీకి వెళ్లిన ఓ మహిళను ఓ వ్యక్తి వేటకొడవలితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన రాజధాని వాషింగ్టన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. పోలీస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లైబ్రరీ గదిలో చదువుకుంటున్న ఓ మహిళపై మాసాచుసెట్స్‌కు చెందిన 23 ఏండ్ల జెఫ్పరీ యావో వేట కొడవలితో తల, రొమ్ము భాగంలో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తమోడుతున్న మహిళ లైబ్రరీ తలుపుల వైపుగా పరిగెత్తింది. అతడు అంతటితో ఆగకుండా ఆమె వైపుగా పరిగెత్తాడు. అడ్డువచ్చిన లైబ్రరీ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడి పరారయ్యాడు. ఆ మహిళ ఎవరు.? అతడు ఎందుకు ఆమెపై దాడి చేశాడు.? అన్న వివరాలు ఇంకా తెలియ రాలేదు. జెఫ్పరీ యావో నివసిస్తున్న ఇంటి చుట్టు పక్కల వారిని బోస్టన్‌ హెరాల్డ్‌ ఇంటర్వ్యూ చేయగా అతని గురించి కొన్ని షాకింగ్‌ విషయాలు తెలిశాయి. గత కొద్ది సంవత్సరాలుగా యావో ప్రవర్తన క్రూరంగా తయారైందని, మాలో ఎవరిని చంపుతాడో అని భయపడుతుండేవాళ్లమని చెప్పారు. అతని మిత్రులు యావో గత కొద్ది సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయాడన్న విషయాన్ని ధృవీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com