ఆస్కార్ వేదికపై శశికపూర్, శ్రీదేవికి నివాళులు
- March 05, 2018
న్యూయార్క్ : 90వ ఆస్కార్ అవార్డుల వేదికపై మృతి చెందిన భారతీయ నటులు శశికపూర్, శ్రీదేవిలకు నివాళులర్పించారు. ఆస్కార్ అవార్డులు ప్రకటించే ముందు మృతి చెందిన చలనచిత్ర ప్రముఖులకు నివాళులర్పించడం సంప్రదాయంగా వస్తోంది. వీరిద్దరూ నటించిన పలు చిత్రాల్ని బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవల్ని సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి, శశి కపూర్లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్ (పెరల్ జామ్ ఫేమ్) ప్రదర్శన జరిగింది. 'ఇన్ మెమొరియం' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ చిత్రాల నిర్మాత, దర్శకుడు రోజర్ మౌరేలకు కూడా నివాళులర్పించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు మేరీ గోల్డ్బెర్గ్, జోహాన్ జోహౌన్సన్, జాన్ హెర్డ్, శామ్ షెఫర్డ్‌లకు కూడా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







