ఇండియాకి వెళుతున్నారా? ఇది మాత్రం తీసుకెళ్ళొద్దు!

- March 08, 2018 , by Maagulf
ఇండియాకి వెళుతున్నారా? ఇది మాత్రం తీసుకెళ్ళొద్దు!

మస్కట్‌: శాటిలైట్‌ ఫోన్లను తమతో తీసుకెళ్ళాలనుకుంటే అది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుందని ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ స్పష్టం చేసింది. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు ఎవరైనాసరే, తమతోపాటు తురాయా / ఇరిడియం శాటిలైట్‌ ఫోన్స్‌ని తీసుకెళ్ళడం నిషిద్దిం. ఎవరైనా ప్రయాణీకుడు ఇలాంటివాటితో ఇండియాకి వెళితే, వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటుగా, ప్రాసిక్యూషన్‌ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇండియన్‌ వైర్‌లెస్‌ యాక్ట్‌ - ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ ప్రకారం వీటిని ఈసుకెళ్ళడం నేరమని ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com