అజ్మన్:ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్స్‌లో షేక్ జాయెద్
- March 09, 2018
అజ్మన్:ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్, అజ్మన్‌లో సరికొత్త ఆలోచన తీసుకొచ్చింది. ఇయర్ ఆఫ్ జాయెద్ని పురస్కరించుకుని, గ్రీన్ లైట్స్‌లో షేక్ జాయెద్ బొమ్మ కన్పించేలా ట్రాఫిక్ సిగ్నల్స్‌ని రూపొందించింది. జోర్డాన్‌కి చెందిన మేథ్స్ టీచర్ అష్రాఫ్ యసీన్ మాట్లాడుతూ, గ్రీన్ సిగ్నల్ లైట్లో షేక్ జాయెద్ బొమ్మ కన్పించడం సర్ప్రైజింగ్గా ఉందని చెప్పారు. తాను డ్రైవింగ్‌లో వుండడంతో ఆ అద్భుతాన్ని చిత్రీకరించలేకపోయాననీ, తన ఫ్రెండ్ మాత్రం ఆ అద్భుతాన్ని క్యాప్చర్ చేసినట్లు తెలిపారు. మళ్ళీ ఇంకోసారి అటువైపు వెళ్ళి, షేక్ జాయెద్ పిక్చర్‌ని గ్రీన్ సిగ్నల్‌లో చూసి ప్రత్యేకమైన అనుభూతిని పొందినట్లు ఆయన వివరించారు. సిరియాకి చెందిన ఫదియా అహ్మద్ అనే వ్యక్తి కూడా, ఈ ఆలోచనను ఓ అద్బుతంగా అభివర్ణించారు. ఎమిరేటీ అబ్దుల్లా సయీద్ మాట్లాడుతూ, షేక్ జాయెద్ ఆలోచనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ షేక్ జాయెద్ పట్ల గౌరవాన్ని మరింత పెంచుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







