హిమాలయాలకు పయనమవుతున్న తలైవా
- March 09, 2018
చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ శనివారం హిమాలయాలకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధులు నిర్ధారించారు. 'తలైవా హిమాలయాలకు వెళ్తున్నారు. ఈ వార్త నిజమే' అని రజనీ ప్రతినిధి రియాజ్ అహ్మద్ ట్వీట్ చేశారు. మహా అవతార్ బాబాజీ నివసించాడని అందరూ విశ్వసించే హిమాలయాల్లోని దునగిరి అనే ప్రాంతంలో ఉన్న గుహల్లో రజనీ ధ్యానం చేయడానికి తరచూ వెళ్తుంటారు. గత ఏడాది రజనీ తన స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మించారు. పరమహంస యోగానంద స్థాపించిన వైఎస్‌ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రజనీ నటించిన '2.ఓ' విడుదలకు సిద్ధమవుతోంది. ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించిన 'కాలా' ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో తలైవా-కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా షురూ కాబోతోంది. మరోపక్క రజనీ రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని కోసం ఆయన బృందం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







