ప్రవాసియ ఇంజనీర్లు కువైట్ ఇంజనీర్స్ సొసైటీ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదనే సర్టిఫికేట్ పొందాలి

- March 12, 2018 , by Maagulf
ప్రవాసియ ఇంజనీర్లు కువైట్ ఇంజనీర్స్ సొసైటీ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదనే సర్టిఫికేట్ పొందాలి

కువైట్ : కువైట్ ఇంజనీర్స్ సొసైటీ (కె.ఇ.ఎస్) నుండి ఎటువంటి  అభ్యంతరం లేదనే సర్టిఫికేట్ ను ప్రవాసియ ఇంజనీర్ల నుంచి పొందకపోతే వారి నివాస అనుమతిని (రెసిడెన్సీ లేదా ఇహమామా పర్మిట్లను) ఎట్టి పరిస్థితిలోనూ పునరుద్ధరించకూడదని  పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పి ఏ ఎమ్) అన్ని కార్మిక విభాగానికి ఒక సూచన జారీ చేసింది .ఈ నిర్దేశించిన విధానం ప్రకారం, ప్రవాసియ  ఇంజనీర్ కువైట్ ఇంజనీర్స్ సొసైటీ నుంచి ఎన్ఓసి తన విద్యావిషయక.. విద్యార్హత కు సంబంధించింది. ముందుగా, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ మరియు కువైట్ ఇంజనీర్స్ సొసైటీ ఇంజనీరింగ్ డిగ్రీ యొక్క ధృవీకరణ కోసం ఒక ఎలక్ట్రానిక్ విధానంను  అభివృద్ధి చేసింది. ప్రస్తుత విధానం  ప్రకారం, ప్రభుత్వ రంగ ఉపాధి కోసం, ఇంజనీరింగ్ డిగ్రీ ఒక ఎన్ బి ఏ గుర్తింపు పొందిన సంస్థ నుండి పొందినదై ఉండాలి. కువైట్ ఇంజనీరింగ్ సొసైటీ వార్షిక ప్రాతిపదికన భారతదేశంతో సహా  ఎన్ బి ఏ గుర్తింపు పొందిన సంస్థల జాబితాను నవీకరిస్తుంది. ఈ కొత్త నిర్ణయంతో ఇంజనీరింగ్ డిగ్రీలు గుర్తింపు పొందిన సంస్థల నుండి పొందని , ప్రవాసియ ఇంజనీర్లపై ఎంతో ప్రభావితం చూపుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com