ఫోటో షూట్ లో గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్..!
- March 12, 2018
"బాహుబలి" అనంతరం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ను, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీయార్ ను కలిపి ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫోటోషూట్ కోసం ఎన్టీయార్ ఇటీవల చరణ్ తో కలిసి అమెరికా వెళ్ళడం తెలిసిందే. సినిమాలో లుక్ కోసం టెస్ట్ షూట్ చేయాలనుకొన్నాడు రాజమౌళి. అయితే.. ఆ షూట్ కి ముందు ఒక పార్టీలో ఎన్టీయార్ మద్యం సేవించి తన హోటల్ రూమ్ లో కాలు జారి పడి గాయాలపాలయ్యాడని తెలుస్తోంది.
నిజానికి త్రివిక్రమ్ సినిమా మొదలవ్వడానికి ముందు రాజమౌళి సినిమా లుక్ కోసం టెస్ట్ ఏంటీ అని అందరూ అనుకొన్నారు. అయితే.. ఎన్టీయార్ స్లిమ్ లుక్ తో ఒక టెస్ట్ షూట్ చేసి అనంతరం త్రివిక్రమ్ సినిమా అయిపోయాక ఇంకోసారి షూట్ చేద్దామనుకొన్నాడట రాజమౌళి. అయితే.. ఇప్పుడు ఎన్టీయార్ దెబ్బలతో అమెరికాలో మంచమెక్కడంతో రాజమౌళి ప్లాన్ అప్సెట్ అయ్యింది. దాంతో రామ్ చరణ్ కి సపరేట్ ఫోటోషూట్ చేస్తున్నాడట. ఎన్టీయార్ మళ్ళీ సెట్ అవ్వడానికి ఒక రెండు రోజులు పట్టే అవకాశం ఉందట.

తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







