దుబాయ్ మెట్రోలో మహిళపై మద్యం మత్తులో దాడి
- March 13, 2018
దుబాయ్ మెట్రో రైలులో ఓ వ్యక్తి, ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు విచారణ జరుగుతోంది. 38 ఏళ్ళ ఇండియన్ ఒకరు, ఓ మహిళను అసభ్యకరంగా తాకాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 14న చోటు చేసుకుంది. సేల్స్మెన్గా పనిచేస్తున్న నిందితుడు మాత్రం, తన మీద వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. లైసెన్స్ లేకుండా ఆల్కహాల్ సేవించాడంటూ వచ్చిన ఆరోపణల్నీ ఆయన ఖండిస్తున్నాడు. మహిళను టచ్ చేసిన మాట వాస్తవమే అయినా, అది అనుకోకుండా జరిగిందని నిందితుడు చెప్పాడు. 27 ఏళ్ళ బాధితురాలు మాట్లాడుతూ రాత్రి 10.15 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందనీ, ఆ సమయంలో నిందితుడు తప్పతాగి వున్నాడనీ, తనను గట్టిగా పట్టుకున్నాడనీ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసులో తీర్పుని మార్చి 27న న్యాయస్థానం వెల్లడించనుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..