నైజీరియా ఘర్షణలు, 25 మంది మృతి

- March 14, 2018 , by Maagulf
నైజీరియా ఘర్షణలు, 25 మంది మృతి

సెంట్రల్ నైజీరియాలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 25 మంది చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. భూమి, నీళ్లు, పశువుల మేత హక్కులకు సంబంధించి కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్లాటీ స్టేట్‌లోని బస్సా ప్రాంతంలో అధిక మంది చనిపోగా..తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. పశువుల కాపరులు దుండన్ నుంచి ఝిరేచి గ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో 25 మంది చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయని స్టేట్ పోలీస్ కమిషనర్ వుండీ అడీ తెలిపారు. వర్గాల మధ్య ఘర్షణలో పెద్ద సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయని, అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. గ్రామస్థులను పొట్టనబెట్టుకున్న వారిని మట్టుకరిపించేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హంట్ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దయచేసి ప్రజలంతా సంయమనంతో ఉండి..వారి ఆయుధాలను పక్కన పెట్టాలని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com