16 వేలమంది ఉద్యోగార్థులు ప్రయివేట్ ఉద్యోగాలలో నియమితులయ్యారు

- March 15, 2018 , by Maagulf
16 వేలమంది ఉద్యోగార్థులు ప్రయివేట్ ఉద్యోగాలలో నియమితులయ్యారు

మస్కట్  : ఉద్యోగార్థుల కోసం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉన్నాయి. మంత్రుల మండలి ఆమోదం పొందిన తర్వాత   డిసెంబర్ 3 వ తేదీ 2017 నుండి ఈ ఏడాది మార్చి 12 వ తేదీ వరకు వివిధ గవర్నరేటర్లలో 16,504 మంది పౌరులు వివిధ ప్రైవేటురంగ సంస్థలలో నియమితుల య్యారని మానవ వనురుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు పొందినవారిలో పురుషుల సంఖ్య 11,121 గా ఉండగా, మహిళల సంఖ్య 5,383 గా ఉన్నట్లు  తెలిపింది. ఉద్యోగులను పొందినవారిలో జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కన్నా తక్కువ విద్యార్హత కలవారు  8,186 మంది , సాధారణ విద్య డిప్లొమా కలవారు 5,520 మంది, హయ్యర్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా యూనివర్సిటీ డిగ్రీ చదువుకున్నవారు 2,798 మంది ఉన్నారు. ఉద్యోగ నియామకాలలో టోకు, రిటైల్ వాణిజ్యం, ఉత్పాదక రంగాల విభాగాలు నిర్మాణ రంగంలో 33.4 శాతం మంది, టోకు మరియు చిల్లర వర్తక రంగంలో 14.5 శాతం ఉండగా, అలాగే  ఉత్పాదక రంగంలో 13.7 శాతం మంది నియమితులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com