కమల్ హాసన్ అంటే తనకు ఎంతో అభినమానం--శివరాజ్ కుమార్

- December 01, 2015 , by Maagulf
కమల్ హాసన్ అంటే తనకు ఎంతో అభినమానం--శివరాజ్ కుమార్

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కిల్లింగ్ వీరప్పన్' మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కర్ణాటక చలన చిత్ర అకాడమీ బెంగులూరులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన తండ్రి రాజ్ కుమార్ అడుగు జాడల్లోనే కెరీర్లో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చిన్న, పెద్ద తేడా లేకుండా భవిష్యత్తులో కన్నడలో అందరూ హీరోలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాను చిన్నతనం నుండి స్టార్ కొడుకుతా ఎప్పుడూ పెరగలేదని, సాధారణ పిల్లాడిగానే పెరిగానని చెప్పారు. నటుడిని కాకపోతే దేశం తరుపున ఆడి మంచి క్రికెటర్ అయుండే వాడిని అన్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు ఎంతో అభినమానం. ఆయన ఓసారి నన్ను ఆలింగనంచేసుకున్నారు. ఆ సంతోషంలో ఆయన హత్తుకున్న పరిమిళం వీడిపోవడం ఇష్టం లేక నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com