'బ్రహ్మోస్' క్షిపణి పరీక్ష విజయవంతం
- March 22, 2018
పోఖ్రాన్: రాజస్థాన్లోని పోఖ్రాన్ క్షిపణి కేంద్రం నుంచి బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చివరిసారిగా 2017 నవంబర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం సుఖోయి -30 ఎంకేఐ నుంచి పరీక్షించారు. గత సంవత్సరం దుబాయ్ ఎయిర్ షోలో కూడా బ్రహ్మోస్ ప్రదర్శన జరిగింది. పలు దేశాల సైనికాధికారులు కూడా వీటిని కొనేందుకు చాలా ఆసక్తి చూయించారు.
బ్రహ్మోస్ గురించి కొన్ని వాస్తవాలు
- బ్రహ్మోస్ ఒక మాధ్యమ శ్రేణి రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి.
- భూమి, గాలి మరియు సముద్రం నుండి దీనిని ప్రయోగించవచ్చు.
- ఇది భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), రష్యన్ ఫెడరేషన్ ఎన్పీఓ మాషినోస్రోయేనియాల ఉమ్మడి వెంచర్.
- బ్రహ్మోస్ అనే పదం భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది(Brahmaputra) మొదటి నాలుగు అక్షరాలు, రష్యాలోని మాస్కోవా నది(Moskva) పేరులోని మొదటి మూడు అక్షరాలన నుంచి వచ్చింది.
- గతంలో బ్రహ్మోస్ 2.8 నుంచి 3.0 మాక్ల వేగంతో ప్రయాణించేది. ఇప్పుడు దీని వేగం 5.0 మాక్లకు అప్గ్రేడ్ చేశారు. (మాక్ = 1234.8 కిలోమీటర్/అవర్)ఇది మాక్
- ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి.
- ఇది 2006 నుంచి సేవలందింస్తోంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







