ఒంట్లో విద్యుత్ ప్రవహిస్తోంది..
- March 22, 2018
అందరి పిల్లల్లానే చదువుకుంటున్నాడు. చదువులో చాలా చురుగ్గా ఉంటాడని టీచర్లనుంచి ప్రశంశలు కూడా అందుకుంటున్నాడు. కేరళ రాష్ట్రం అల్లప్పుఝూ పట్టణానికి చెందిన తాహిర్ విలియమ్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తన ఒంట్లో ఓ అద్భుత శక్తి ఉందని అతడికి కూడా తెలియదు. తండ్రి నాసిర్ పైబర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఓ రోజు తండ్రి ఇంట్లో ఎల్ఈడీ బల్బ్ పెడదాము, వెలుగు ఎక్కువ వస్తుంది కరెంట్ తక్కువ కాలుతుందని షాపు నుంచి బల్బ్ తీసుకువచ్చాడు.
బల్బ్ పెట్టడానికని స్టూల్ ఎక్కుతూ తాహిర్కి బల్బ్ ఇచ్చి అందివ్వమన్నాడు. ఇంతలో ఆశ్చర్యంగా తాహిర్ చేతిలో ఉన్న బల్బ్ వెలిగింది. కొడుకు చేతిలో బల్బ్ వెలిగే సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి కిందకు దిగాడు తండ్రి. కొడుకు శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుందని గమనించాడు. చేతిలోనే కాకుండా అతడి శరీరంలో ఎక్కడ పెట్టినా బల్బ్ వెలుగుతోందని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. తాహిర్ అత్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పడు వైరల్ అవుతోంది. అదే ఇవేమి పట్టని తాహిర్ చక్కగా స్కూలుకి వెళుతున్నాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న తాహిర్ ఫైనల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







