శ్రీదేవి, జయప్రద ఒకే వేదికపై తళుక్కుమన్నారు
- December 01, 2015
ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రద. అప్పట్లో వీరిమధ్య తెరమీదే కాదు తెరవెనుక బద్ధశత్రుత్వం ఉందని చెప్పుకొనేవారు. అయితే వీరిద్దరు కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ తమ హవా కొనసాగించారు. 'దేవత', 'ఆఖిరీ రాస్తా', 'ఔలాద్' వంటి విజయవంతమైన చిత్రాల్లో జయప్రద, శ్రీదేవి కథానాయికలుగా మెప్పించారు. అయితే వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావని ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. అయితే వారిద్దరు కలిసి నటించే సీన్లు విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అలనాటి అందాల తారలు శ్రీదేవి, జయప్రద ఇటీవల ఒకే వేదికపై తళుక్కుమన్నారు. ఆత్మీయంగా హత్తుకొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన ఘట్టానికి జయప్రద కొడుకు సిద్ధార్థ వివాహ రిసెప్షన్ వేదిక అయింది. ఈ వేడుకకు భర్త బోనీ కపూర్‌తో హాజరైన శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా.. కంచీవరం పట్టుచీర కట్టుకున్న జయప్రద వారికి స్వాగతం పలికారు. రిసెప్షన్ వేదికపై సరదా గడిపిన ఇరువురు తారలు ప్రస్తుతం తమ మధ్య ఉన్న ఆత్మీయతను చాటుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







