ప్రవాస కేరళీయుల ఆప్తుడు - డాక్టర్‌ అహ్మద్‌కు కురియన్‌ ప్రశంస

- March 25, 2018 , by Maagulf
ప్రవాస కేరళీయుల ఆప్తుడు - డాక్టర్‌ అహ్మద్‌కు కురియన్‌ ప్రశంస

తిరువనంతపురం: ప్రవాస కేరళీయులకు, గల్ప్‌ నుంచి తిరిగి వచ్చిన వారికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎస్‌ అహ్మద్‌ కీలక పాత్ర వహించారని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ పిజె కురియన్‌ కొనియాడారు. సామాజిక సేవకు ఇటీవల అహ్మద్‌ను గౌరవ డాక్టరేట్‌ లభించిన సందర్భంగా జరిగిన సత్కార సభలో కురియన్‌ ప్రసంగించారు. కుటుంబ నియంత్రణ పథకాల అమలు సహా పలు రంగాల్లో అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికీ కృషి చేశారని కురియన్‌ పేర్కొన్నారు. ప్రవాస భారతీయులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఆల్‌ కేరళ రిటర్నీస్‌ ఆర్గనైజేషన్‌ను 1988లో అహ్మద్‌ స్థాపించారు. ప్రస్తుతం దేశ విదేశాల్లోని 36 ఎన్నారై సంస్థల సంఘానికి ఆయన సమన్వయ మండలి చైర్మన్‌గా ఉన్నారు. బతుకు తెరువు కోసం దేశంలోని తమ స్వస్థలాలను విడిచి వెళ్లిన వారి సమస్యలను పరిష్కరించడానికి అంకితం కావాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర అహ్మద్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com