సౌదీపై హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణుల ప్రయోగం

- March 26, 2018 , by Maagulf
సౌదీపై హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణుల ప్రయోగం

రియాద్‌ : యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీపై విరుచుకుపడ్డారు. రియాద్‌ నగరంలోని పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించారు. తిరుగుబాటు దారులు జరిపిన క్షిపణుల దాడుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సౌదీ సంకీర్ణదళాల అధికార ప్రతినిధి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం..రియాద్‌ నగరంపై తిరుగుబాటుదారులు ఏడు క్షిపణులు ప్రయోగించారు. వాటిలో మూడు క్షిపణులను తమ బలగాలు ధ్వంసం చేశాయని అన్నారు. సౌదీలోని ఆబా, జీజన్‌, నజ్రాన్‌ నగరాల్లోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు క్షిపణులు ప్రయోగించి ఉంటారని అనుమానిస్తున్నామని అన్నారు. కాగా, తామే సౌదీపై క్షిపణులు ప్రయోగించినట్టు హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి మొహ్మద్‌ అల్‌-బుఖైతీ సోమవారం తెలిపారు. యెమెన్‌లోని అనేక నగరాలపై సౌదీ సంకీర్ణదళాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయని, ఆ దాడులకు ప్రతీకారంగా క్షిపణులు ప్రయోగించినట్టు పేర్కొన్నారు. సౌదీపై మధ్య స్థాయి, అధిక దూరం ప్రయాణించగల ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com