సింగపూర్‌లో ఉగాది కల్చరల్‌ నైట్‌

- March 26, 2018 , by Maagulf
సింగపూర్‌లో ఉగాది కల్చరల్‌ నైట్‌

సింగపూర్‌ : సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది కల్చరల్‌ నైట్‌ను భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.  మార్చి 31 శనివారం సాయంత్రం కల్లాంగ్‌ థియేటర్, వన్‌ స్టేడియం వాక్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు భారీ ఎత్తున స్థానిక తెలుగు ప్రజలు హాజరవ్వాలని సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమానికి, యాంకర్‌ శ్యామల, సింగర్స్‌ సత్య యామిని, అనుదీప్‌, ప్రవీణ్‌ కుమార్‌, వీఆర్‌ లక్ష్మీ ధూలిపాళ్లలు, కమేడియన్స్‌ మాస్‌ అవినాష్‌, కెవ్వు కార్తిక్‌, తాగుబోతు రాజమౌళి, డ్యాన్సర్స్‌ ఆట సందీప్‌ టీమ్‌తో పాటు ఢీ ఫేమ్ ప్రియాంకలు హాజరుకానున్నారు. ఉగాది కల్చరల్‌ నైట్‌ 2018ను విజయవంతం చేయడానికి అహర్నిశలూ కృషి చేస్తున్న సింగపూర్‌ తెలుగు సమాజం సభ్యులు సత్య చిర్ల, సత్య  సూరిశెట్టి‌, జ్యోతేశ్వర్‌, నాగేష్‌, వినయ్‌, రామ్‌, అనిల్‌, ప్రదీప్‌లకు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను సందర్శించండి. goo.gl/wQRjyG

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com