బీచ్‌లు, పార్కుల్లో డ్రైవింగ్‌ని నిషేధించిన మస్కట్
- March 28, 2018మస్కట్: బీచ్‌లు, పార్కుల్లో వాహనాల డ్రైవింగ్‌ని నిషేధిస్తూ మస్కట్ మునిసిపాలిటీ నిర్నయం తీసుకుంది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి ఈ విషయమై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మస్కట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ బదర్ బిన్ అలి అల్ బహ్రి మాట్లాడుతూ, సీబ్ బీచ్‌కి సంబంధించి పలు ప్రాంతాల్లో కాంక్రీట్ బారియర్స్‌ని ఏర్పాటు చేసి, వాహనాల ప్రవేశానికి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. బీచ్‌లో నడుస్తూ వెళ్ళేవారికి ఈ వాహనాలు ప్రమాదకరంగా తయారవుతుండడం వల్లనే డ్రైవింగ్ నిషేధించినట్లు ఆయన చెప్పారు. బీచ్ పొడవునా, డ్రైవింగ్ నిషేధానికి సంబంధించి హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..