హెచ్ఐవీపై సమరానికి ఒమన్ న్యూ ప్లాన్
- December 01, 2015
ప్రపంచ మానవాళికి పెను సవాల్‌గా మారిన హెచ్ఐవీ నియంత్రణకు వివిధ దేశాలు తమవంతుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఒమన్ ప్రభుత్వం కూడా జాతీయ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. 2016 నాటికి తమ దేశంలో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిసీజ్ సర్విలెన్స్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైఫ్ అల్ అబ్రి ఈ విషయాన్ని ప్రకటించారు. సీనియర్ అధికారులు, మెడికల్ ప్రొఫెషనల్స్ కలిసి సుమారుగా 200 మందితో ఓ సమావేశాన్ని నిర్వహించి, హెచ్ఐవి ఎయిడ్స్‌పై పోరాటంలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 2020 నాటికి 90-90-90 అనే టార్గెట్‌తో పనిచేయనున్నట్లు డాక్టర్ అబ్రి చెప్పారు. ఈ టార్గెట్ ఉద్దేశ్యమేంటంటే 2020 నాటికి హెచ్ఐవి సోకినవారిలో 90 శాతం మంది తమకు ఆ వైరస్ సోకిందని తెలుసుకునేలా చేయడం, 90 శాతం మంది వ్యాధిగ్రస్తులు వైద్య చికిత్స అందుకునేలా చేయడం, 90 శాతం మందిలో హెచ్ఐవి వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టేలా చేయడం. నేషనల్ టీబీ ఎయిడ్స్ మరియు లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ మొహమ్మద్ రెదా మూసా అల్ లవాతి మాట్లాడుతూ, న్యూ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







