బుధుడిని తలపిస్తున్న ఉక్కు గ్రాహం
- March 29, 2018
లండన్: పరిమాణంలో, బరువులో భూమికంటే కాస్త పెద్దగా.. బుధ గ్రహం లక్షణాలు.. అధికశాతం ఇనుము కలిగి ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి దాదాపు 26 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యారాశిలో ఉన్న ఈ గ్రహానికి కే2-229బీ అని పేరు పెట్టారు. కొందరు దీనిని ఉక్కుగ్రహంగా పిలుస్తున్నారు.
బ్రిటన్‌లోని వార్విక్ యూనివర్సిటీ, ఫ్రాన్స్‌లోని ఏఐఎక్స్-మార్సెయిల్లే యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కే2 టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ గ్రహాన్ని కనుగొన్నారు. కే2-229బీ గ్రహం పరిమాణంలో భూమి కన్నా 20 శాతం పెద్దది. అలాగే బరువులో ఇది భూమికి రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ గ్రహం తన నక్షత్రానికి కేవలం 18 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోంది. ఈ దూరం.. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో వందో వంతే. ఫలితంగా మధ్యాహ్న సమయంలో కే2-229బీ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత గరిష్ఠంగా 2,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు వరకు చేరుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అంతేకాదు, ఈ గ్రహం ప్రతి 14 గంటలకు ఒకసారి తన నక్షత్రం చుట్టూ తిరిగివస్తోందట. అయితే ఈ గ్రహం ఉపరితల లక్షణాలు మన సౌరవ్యవస్థలోని బుధ గ్రహంతో పోలి ఉన్నాయని వార్విక్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు. కే2-229బీపై అధిక మొత్తంలో ఇనుము ఉండటంతో పరిమాణం కన్నా బరువు ఎక్కువగా ఉన్నదన్నారు.
మన సౌరవ్యవస్థలోని మొదటి గ్రహమైన బుధ గ్రహం కూడా దాని పరిమాణం కన్నా బరువు ఎక్కువగా ఉందని, సౌరవ్యవస్థలోని మిగతా గ్రహాలతో పోల్చితే బుధుడి ఆవిర్భావం కూడా భిన్నంగా సాగిందని ఆయన వివరించారు.
'కే2-229బీని చూడగానే చాలా ఆశ్చర్యపోయాం. విశ్వంలో బుధుడి లాంటి గ్రహాలు చాలా అరుదుగా ఉంటాయని ఇన్నాళ్లూ భావించాం. కానీ కే2-229బీ గ్రహం మా ఆలోచనలను మార్చింది..' అని డేవిడ్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!