లాటరీతో తన లక్కే మారిపోయింది

- March 29, 2018 , by Maagulf
లాటరీతో తన లక్కే మారిపోయింది

ఒక్క లాటరీతో జీవితమే మారిపోతుంటుంది. సామాన్యుడు కాస్తా ఓవర్‌ నైట్‌లో కోటీశ్వరుడైపోతాడు. కెనడాకు చెందిన యువతికి ఓ లాటరీ తగిలి పద్దెనిమిదేళ్లకే  ఆమెను అదృష్టం వరించేలా చేసింది.

చార్లీ లగార్డె అనే యువతి తన పుట్టిన రోజున షాపింగ్‌కు వెళ్లి, ఆమె పేరు మీద ఓ లాటరీ టికెట్టు కొనుక్కుంది. కొద్దిరోజుల తర్వాత డ్రాలో ఆమె పేరు రావటంతో.. లాటరీ సంస్థ వారు ఆమెకు రెండు అవకాశాలిచ్చారు. అందులో ఒకటి మిలియన్ కెనడా డాలర్ల క్యాష్ ప్రైజ్( రూ.5.50కోట్లు) లేదా ఆమెకు జీవితాంతం ప్రతి వారం వెయ్యి డాలర్లు(రూ.50వేలు) చెల్లించడం. ఇందులో చార్లీ రెండో ఆఫర్‌ని ఎంపిక చేసుకుంది. 

చార్లీ  ఆ లాటరీ డబ్బులతో ఫోటోగ్రఫీ కోర్సు చేయాలనుకుంటుందట.. జాతీయ స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. ఈ డబ్బుతో నా కోర్సులో భాగంగా నాకు నచ్చిన ప్రాంతానికి వెళ్లవచ్చు. పైగా ఈ డబ్బులకు పన్ను కట్టాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చింది. చార్లీ విషయం తెలిసిన వారందరూ డబ్బు జీవితాలను మార్చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు.  ‘అసలైన లాటరీ అంటే ఇదీ’ అంటూ ఆమెపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.  లక్ష్మీదేవి కటాక్షిస్తే జీవన శైలి మారిపోతుందనడానికి ఇదే నిదర్శనమని మరికొందరంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com